ఎన్టీఆర్ అరవింద సమేత ఓవర్సీస్ రైట్స్ వివరాలు !

Published on May 27, 2018 4:20 pm IST

అరవింద సమేత వీర రాఘవ సినిమా యొక్క ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ హక్కులు ‘ఎల్ ఏ తెలుగు’ సంస్థ దక్కించుకుంది . గతంలో ఈ సంస్థ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాని పంపిణీ చేసింది. సుమారు 20 కోట్లకు ఈ సినిమా హక్కులను కొంటె దీనిలో సగం మాత్రమే రికవరీ చేయగలిగింది . పంపిణి పరంగా ఈ సినిమానే వారికి తొలి సినిమా .
తొలి సినిమా తోనే దారుణంగా దెబ్బతిన్న ఎల్ ఏ తెలుగు సంస్థ నష్టాలను భర్తీ చేయాలనీ హారిక హాసిని క్రియేషన్స్ అరవింద సమేత సినిమా హక్కులను వారికీ కట్టబెట్టింది . కాగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది .దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈచిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :