యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 12వ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్ విలన్ పాత్రలో నటిస్తున్నారట. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన విలన్ గా నటిస్తున్న ఈచిత్రంలో ఆర్యన్ అతనికి సహకరించే పాత్రలో కనబడనున్నాడని సమాచారం.ఇక గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అయన ఈ చిత్రం తో మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారు.
‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రంలో సీనియర్ హీరో ,హీరోయిన్లు ప్రశాంత్, స్నేహ లుముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


