ఇక మహేష్ ఈ డైరెక్టర్ తో లేనట్టే..?

ఇక మహేష్ ఈ డైరెక్టర్ తో లేనట్టే..?

Published on Nov 22, 2020 11:00 AM IST

mahesh babu int

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంపై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇక ఈ చిత్రం అనంతరం మహేష్ దర్శక ధీరుడు రాజమౌళితో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ దానిని టేకప్ చేసే లోపే ఒకటి రెండు సినిమాలు చేస్తారని టాక్ వినిపించింది.

అయితే ఈ నేపథ్యంలో మహేష్ నెక్స్ట్ ఎవరితూ చేస్తారు అన్న విషయంలో టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. కానీ ఈ రేస్ లో మాత్రం మహేష్ టాప్ దర్శకుడు లేడనే సమాచారం. అతడే వంశీ పైడిపల్లి. వంశీ ఇప్పటికే మహేష్ కెరీర్లో బెంచ్ మార్క్ సినిమా అయినటువంటి 25 వ సినిమాకు “మహర్షి” అనే మంచి విజయాన్ని అందించారు.

కానీ వీరి కాంబో మళ్ళీ సెట్టవుతుందని అనుకుంటూనే పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అది కాస్తా మరింత దూరం వెళ్ళిపోయినట్టు సమాచారం. మహేష్ నెక్స్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తోనే చెయ్యడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది. మరి వీరి కాంబోపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు