మన టాలీవుడ్ లో గడిచిన కొన్నేళ్లలో స్టార్ట్ అయ్యిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల బ్యాక్ డ్రాప్ లో వాటి అన్నిటికీ కాస్త డిఫరెంట్ గా సాలిడ్ కాన్సెప్ట్ తో వచ్చిన లేటెస్ట్ చిత్రమే “హిడింబ”. మరి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నటించిన ఈ చిత్రాన్ని అనీ కన్నెగంటి తెరకెక్కించాడు.
మరి అశ్విన్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఛాయిస్ గా నిలిచిన ఈ చిత్రం అయితే మంచి వసూళ్లు కూడా అందుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత లేటెస్ట్ గా అశ్విన్ బాబు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ను అనౌన్స్ చేసాడు. మరి ఈరోజు అశ్విన్ బాబు బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇది ఓ మెడికో థ్రిల్లర్ గా చెప్తున్నారు.
“వచ్చిన వాడు గౌతమ్” అంటూ రిలీజ్ చేసిన ఇంట్రెస్టింగ్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తిగా ఉంది. ఇక ఈ చిత్రాన్ని మామిడాల ఎం ఆర్ రామకృష్ణ దర్శకత్వం వహించనుండగా గౌర హరి సంగీతం అందిస్తున్నాడు అలాగే షణ్ముఖ పిక్చర్స్ బ్యానర్ పై ఆలూరి సురేష్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక హీరోయిన్ ఇతర క్యాస్టింగ్ వివరాలు మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.


