నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తుతం తన సినిమాలకు బిజినెస్ చేస్తున్నాడు. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ అక్టోబర్ 1న విడుదల చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ- రిలీజ్ బిజినెస్ అద్భుతంగా సాగుతుంది.
ఈ చిత్ర ఓవర్ సీస్ హక్కులను ఏసియన్ మూవీస్ సంస్థ భారీ ధరకు సొంతంచేసుకుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయని
దీని ద్వారా తెలుస్తుంది. ఈ చిత్రంలో కాజల్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు కమిలిని ముఖర్జీ వంటి తారలు నటిస్తున్నారు.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో రాం చరణ్ కనిపించనున్నాడు


