విషాదం : ప్రముఖ నటుడు మృతి !

Published on May 17, 2021 4:04 pm IST

ప్రముఖ తమిళ నటుడు నితీశ్‌ వీరా(45) కరోనా మహమ్మారితో కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆయన కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. నితీశ్‌ వీరా నటుడిగా ఎదుగుతున్న టైంలో ఇలా జరగడం బాధాకరమైన విషయం.

నితీశ్‌ వీరా నటుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నితీశ్‌ ‘అసురన్‌’ ‘పేరరుసు’, ‘వెన్నిల కబడి కుళు’, ‘పుదు పేట్టై’ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం నితీశ్‌ వీరా విజయ్‌ సేతుపతి, శృతీ హాసన్‌ జంటగా నటిస్తున్న ‘లాభం’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. నితీశ్‌ వీరా మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘123తెలుగు.కామ్’ నుండి నితీశ్‌ వీరా మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :