తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ జనవరి 2 నుండి మొదలుకానుంది.
హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్ నందు ఈ చిత్రీకరణ మొదలుకానుంది. ఈ చిత్రంపై వెంకీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రేక్షకులు సైతం ధనుష్ చేసిన పాత్రలో వెంకీ ఎలా ఉంటాడో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థపై సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కథానాయిక, ఇతర ప్రధాన పాత్రల కోసం నటీనటుల్ని ఎంపిక చేసే పనులు జరుగుతున్నాయి.
