విజయ్, అట్లీ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !
Published on Dec 6, 2018 3:00 am IST

తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవలే మురుగదాస్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ ‘సర్కార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. కాగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో విజయ్ తదుపరి చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే . తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం విజయ్ ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ విన్నాడట. స్క్రిప్ట్ లో కొన్నిమార్పులు సూచించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాతి రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక గతంలో విజయ్, అట్లీ కలయికలో వచ్చిన ‘తేరి, మెర్సల్’ సినిమాలు బక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో వీరి కాంబినేషన్ లో ఈ సారి రాబోయే చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని, విజయ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.మరి నిజంగానే హిట్ అవుతుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook