షారుఖ్ ఖాన్ సినిమా పనుల్ని వేగవంతం చేసిన అట్లీ

Published on Jun 29, 2021 8:54 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమా చేయలేకపోతున్నందున ఆలోచనలో పడిన షారుక్ లాంగ్ బ్రేక్ తీసుకుని చివరికి సౌత్ దర్శకులైతేనే మంచి మసాలా ఎంటెర్టైనర్ తీయగలరని భావించి అట్లీకి ఛాన్స్ ఇచ్చారు. చాలా నెలల క్రితమే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈరోజు షారుక్ లుక్ టెస్ట్ ఇవ్వడం కూడ జరిగిందట.

ఇందులో షారుక్ ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్ కూడ ఉంది. ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా ఇంకొకటి క్రిమినల్ రోల్ అని తెలుస్తోంది. ఇండియూలో షారుక్ సరసన హీరోయిన్ కోసం టాప్ హీరోయిన్లను అప్రోచ్ అవుతున్నారట. ఇప్పటీకే కత్రినా కైఫ్, పరిణీతి చోప్రా, దీపికా పదుకొనెలను సంప్రదించారట. మరి ఇందులో ఎవర్ని ఫైనల్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది. అట్లీ అంటేనే యాక్షన్, కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన గత చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. కాబట్టి ఈ చిత్రం కూడ ఆ తరహాలోనే ఇంకాస్త భారీగా ఉంటుందట. చిత్రం హిందీతో పాటు ఇతర ప్రధాన భాషల్లో సైతం విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం :