వచ్చే ఏడాది విడుదల కానున్న’అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ !

వచ్చే ఏడాది విడుదల కానున్న’అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ !

Published on Aug 15, 2018 1:35 AM IST


త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం అత్తారింటికి దారేది. 2013లో విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల తరువాత ఈ చిత్రాన్ని కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

ప్రముఖ హీరో శింబు నటించనున్న ఈచిత్రాన్ని సుందర్ . సి తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈచిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్ర వచ్చే ఏడాది జనవరి లో విడుదల చేయనున్నారు. మరి తెలుగులోలాగే అక్కడ కూడా ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు