సైరా మేకింగ్ వీడియోతో ఆమె పాత్ర తెలిసిపోయింది.

Published on Aug 15, 2019 1:00 am IST

చిరంజీవి ప్రధాన పాత్రలో మొదటితరం స్వాతంత్ర్య సమరయోధుడు రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ మూవీ మేకింగ్ వీడియోని నేడు విడుదల చేయడం జరిగింది. మేకింగ్ వీడియోలో ప్రముఖ నటుల ముఖ్య పాత్రలతో పాటు, మెగా హీరోయిన్ కొణిదెల నిహారిక పాత్రను కూడా పరిచయం చేయడం జరిగింది.

దీనితో ఆమె పాత్రపై స్పష్టత వచ్చినట్లైంది. గతంలో నిహారిక తను నటించిన ‘సూర్యకాంతం’ చిత్ర ప్రొమోషన్స్ కార్యక్రమంలో ఈ విషయంపై అడుగగా అవును నాది చాలా చిన్న పాత్ర, కేవలం కొద్దిసేపు చిరంజీవితో పాటు కనిపిస్తాను అన్నారు. నేడు విడుదలైన మేకింగ్ వీడియోలో నిహారిక గిరిజన యువతి గెటప్ లో బ్రిటిష్ సైనికులతో పోరాడుతున్నట్లు ఉంది. బహుశా గిరిజనులపై బ్రిటిష్ సైన్యం చేస్తున్న అకృత్యాలను ఆపేందుకు సైరా నరసింహారెడ్డి అక్కడకు వస్తాడేమో అనిపిస్తుంది.ఆ ఒక్క సన్నివేశంలో ఈ తండ్రీకూతుళ్ళు కనబడనున్నారేమో. నిహారిక మాత్రం గిరిజన యువతి పాత్ర చేస్తుందన్న విషయం ఐతే స్పష్టమైంది.

సంబంధిత సమాచారం :