‘శ్రీమంతుడు’లో ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఎపిసోడ్ ఇదే.!

‘శ్రీమంతుడు’లో ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఎపిసోడ్ ఇదే.!

Published on Aug 5, 2015 7:33 PM IST

Srimanthudu
టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో, థియేటర్స్ వద్ద సందడి మొదలైపోతుంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతోంది అంటే అభిమానులు చేసే హడావిడి మరో రేంజ్ లో ఉంటుంది. మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’ థియేటర్స్ లో సందడి చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో క్రేజ్ తో పాటు సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాపై సెన్సార్ బోర్డ్ ప్రశంశలు కురిపించింది.

ఇప్పటికే ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఎమోషనల్ ఎపిసోడ్స్ గురించి తెలియజేశాం కానీ ఈ సినిమాలో ప్రతి ఒక్కరిని థ్రిల్ చేయడమే కాకుండా యువతకి పిచ్చ కిక్ ఇచ్చే ఎపిసోడ్ ఒకటుందట.. అదే ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్ గా కనిపించే ఎపిసోడ్.. ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ‘ కాలేజ్ ఎపిసోడ్ లో స్టూడెంట్ గా కనిపించే మహేష్ బాబు చూసే ఆడియన్స్ ఓ తెలియని థ్రిల్ ని ఫీలయ్యేలా చేయడమే కాకుండా యువతకి క్రేజీగా ఫీలయ్యేలా చేస్తుందట. మహేష్ మునుపెన్నడూ ఇలాంటి కాలేజ్ ఎపిసోడ్ చేయలేదని, అందుకే ఆ ఎపిసోడ్ లోని ప్రతి బిట్ మరియు మహేష్ – శృతి రొమాంటిక్ ట్రాక్ యువతని ప్రేమలో పడేస్తుందని’ అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ కూడా అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు