‘సమ్మోహనం’ సుధీర్ బాబులోని కొత్త నటుడ్ని పరిచయం చేస్తుందట !
Published on Jun 13, 2018 9:21 am IST

ఈ వారం విడుదలకానున్న చిత్రాల్లో ‘సమ్మోహనం’ కూడ ఒకటి. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలు అందుకోలేకపోయిన హీరో సుధీర్ బాబుకు ఈ చిత్ర విజయం చాలా కీలకంగా మారింది. అంతేగాక ఈ సినిమాతో నటుడిగా కూడ సుధీర్ బాబు స్థాయి పెరుగుతుందని అంటున్నారు.

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ సినిమా చేసేవరకూ సుధీర్ బాబులో ఇంతమంచి నటుడు ఉన్నాడని నాక్కుడా తెలీదు అనగా సుధీర్ బాబు కూడ ఈ సినిమా తన కెరీర్లో చాలా ముఖ్యమైనదని, ఇలాంటి పాత్రలూ ఎప్పుడో కానీ రావంటూ తనలోని నటుడ్ని పూర్తిగా సంతృప్తిపరచిన సినిమా ఇదేనని అన్నారు. మరి ఇన్నాళ్లు మనకు కనిపించని సుధీర్ బాబులోని కొత్త తరహా నటుడు ఎలా ఉంటాడో చూడలంటే 15వరకు ఆగాల్సిందే.

 
Like us on Facebook