టాలీవుడ్ స్టార్ ఆడియోగ్రాఫర్ ఇకలేరు.!

టాలీవుడ్ స్టార్ ఆడియోగ్రాఫర్ ఇకలేరు.!

Published on Apr 20, 2015 12:00 PM IST

madhusudan-reddy
కేవలం రెండు రోజుల గ్యాప్ లోనే టాలీవుడ్ లో మరో బాధాకరమైన విషయం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితమే అలనాటి లేజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి కుమారుడు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చనిపోయారు. ఈ బాధ నుంచి కోలుకునే లోపే టాలీవుడ్ లో మరో మరణ వార్త వినపడడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన ఎవరో కాదు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆడియోగ్రాఫర్ గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్ను మూశారు. ఎన్నో సూపర్ హిట్ మరియు మరపురాని సినిమాలకు ఆయన ఆడియో గ్రాఫర్ గా పనిచేసాడు.

గోవిందా గోవిందా సినిమాతో రీ రికార్డింగ్ అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన మధుసూదాన్ రెడ్డి 1995 లో వచ్చిన సిసింద్రీ సినిమాతో ఆడియో గ్రాఫర్ గా మారాడు. ఆయన ఒక్క ఆడియో గ్రాఫర్ గానే కాకుండా డిటిఎస్ మిక్సింగ్ ఇంజనీర్ గా, సౌండ్ రికార్డిస్ట్ గా, సౌండ్ ఇంజనీర్ గా, సౌంగ్ మిక్సర్ గా ఇలా సుమారు 125కు పైగా సినిమాలకు పనిచేసారు. గులాబి, తమ్ముడు, కలిసుందాం రా, మురారి, ఆది, ఒక్కడు, అతడు, బొమ్మరిల్లు, అరుంధతి, కిక్, రాజన్న, మిర్చి, మనం, ఒక లైలా కోసం సినిమాలకు పనిచేసాడు. ఇలాంటి ఓ టాలెంటెడ్ టెక్నీషియన్ ఇండస్ట్రీకి దూరం అవ్వడంతో టాలీవుడ్ బాధలో మునిగిపోయింది.

123తెలుగు.కామ్ తరపున ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.

తాజా వార్తలు