ఆగస్ట్ 1 నుండి ‘అవును 2’ రెగ్యులర్ షూటింగ్..!

ఆగస్ట్ 1 నుండి ‘అవును 2’ రెగ్యులర్ షూటింగ్..!

Published on Jul 29, 2014 10:52 AM IST

Avanu2

హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు రూపొందించిన చిత్రం ‘అవును’. 2012లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. రెండేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు దర్శకుడు. ‘అవును’లో నటించిన హీరో, హీరోయిన్ తో పాటు ఇతర నటినటులు కూడా ‘అవును-2’లో నటిస్తారు.

ఆగస్ట్ 1 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అదే రోజు హీరో హర్షవర్ధన్ రాణే నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మాయ’ సినిమా విడుదల కానుండడం విశేషం. ‘అవును 2’ సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ షూటింగ్ పూర్తవుతుంది. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

హారర్ చిత్రాలలో ‘అవును’ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ప్రేక్షకులను భయపెట్టడానికి కెమెరా గిమ్మికులు ప్రదర్శిస్తుంటారు దర్శకులు. ‘అవును’ సినిమాలో ప్రతి సన్నివేశంలో ఫ్రేమ్ చేంజ్ చేయకుండా భయపెట్టారు రవిబాబు. మరోసారి ‘అవును 2’ కోసం సరికొత్త కథ, కధనాలతో రెడీ అయ్యారు.

తాజా వార్తలు