నటుడిగా తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత దర్శకుడిగా మారి ‘ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాలతో దర్శకత్వంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి ‘శ్రీనివాస్ అవసరాల’. నటుడిగా ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు కాకుండా అప్పుడప్పుడు కాస్త వైవిష్యభరితమైన సినిమాలు కూడా చేస్తుండాలి నమ్మే అవసరాల ప్రస్తుతం బాలీవుడ్ ‘హంటర్’ సినిమా తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఇందులో అవసరాల ఒక సెక్స్ అడిక్ట్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ అడల్ట్ కామెడీ చిత్రానికి తెలుగులో ‘సోగ్గాడు’ అని నామకరణం చేశారు. కొత్త దర్శకుడు నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలోనే విడుదల చేయనున్నారు. కొత్త తరహా కథా కథనాలతో ఉండబోతున్న ఈ చిత్రంలో శ్రీముఖి, తేజస్వి మడివాడ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తరహా పాత్రను చేయడానికి తానేం మొహమాట పడటంలేదని అవసరాల ఇంతకు ముందే తెలిపారు. మరి మన తెలుగు నేటివిటీకి కాస్త భిన్నంగా, బోల్డ్ గా ఉండే ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకుల మన్ననలు పొందుతుందో డిసెంబర్ లో చూడాలి.


