విడుదల తేదీ : డిసెంబర్ 19, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్ తదితరులు
దర్శకుడు : జేమ్స్ కామెరూన్
నిర్మాణం : మ్స్ కామెరూన్, రిక్ జాఫా, అమండా సిల్వర్
సంగీత దర్శకుడు : సైమన్ ఫ్రాంగ్లెన్
సినిమాటోగ్రాఫర్ : రస్సెల్ కార్పెంటర్
ఎడిటర్ : జేమ్స్ కామెరూన్, జాన్ లాండౌ.
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రపంచాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఇప్పుడు దీని మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3 Review) ప్రేక్షకులను మైమరపించేందుకు ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
Avatar 3 Review – కథ :
కథ విషయానికి వస్తే.. అవతార్ మొదటి భాగంలో అడవులను, రెండో భాగంలో సముద్రాలను చూపించిన జేమ్స్ కామెరాన్ .. మూడో భాగంలో (Avatar 3 Review) ‘అగ్ని’ తత్వాన్ని పరిచయం చేశారు. పండోర గ్రహంలోని అగ్నిజాతి (యాష్ పీపుల్) అనే కొత్త తెగ కథలోకి ఎంట్రీ ఇస్తోంది. వీరు భిన్నంగా, క్రూరంగా ఉంటారు. మూడో భాగం కథ విషయానికి వస్తే.. జేక్ సల్లీ తన భార్య నేతిరితో పాటు తన పిల్లలతో సముద్ర జాతులతో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఐతే, జేక్ సల్లీ పెద్ద కొడుకు నెటెయమ్ చావుకి అతని చిన్న కుమారుడు లోక్ కారణం అని జేక్ సల్లీకి అభిప్రాయం ఉంటుంది. మరోవైపు జేక్ కూతురు కిరి, అనిపెంపుడు కొడుకు స్పైడర్ మధ్య జరిగిన డ్రామా ఏమిటి ?, అదేవిధంగా జేక్ సల్లీ పై పగతో క్వారిచ్ రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా తన పగను తీర్చుకోవడానికి క్వారిచ్ తన మనుషులతో జేక్ సల్లీ – నేతిరి లను వెతుక్కుంటూ వస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి ?, దీనికితోడు వరాంగ్ (ఊనా చాప్లిన్) కూడా క్వారిచ్ కి తోడు అవుతుంది. వీరిద్దరూ జేక్ సల్లీ కుటుంబానికి ఎలాంటి సవాళ్లు విసిరారు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో అందరినీ కట్టిపడేశారు. ఆ స్థాయిలో జేమ్స్ కామెరూన్ విజువల్ మాయాజాలం ఉంది. ఈ ఫ్రాంచైజీలో మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఈ స్టోరీని చెప్పిన విధానం చాలా బాగుంది. ఎమోషన్స్ ను కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి ప్రేక్షకుడ్ని పండోర ప్రపంచానికి తీసుకువెళ్లారు. ప్రతి సీన్ లోని విజువల్స్, పాత్రలు చాలా బాగున్నాయి.
ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు భావోద్వేగంతో సాగడం ఆకట్టుకుంది. వరాంగ్ పాత్ర అద్భుతంగా ఉంది. ఆకాశంలో భారీ నౌకల్లో తిరిగే జాతి సీన్ కూడా బాగుంది. ఇక కొత్త ముప్పుల నుంచి తన వారిని రక్షించడానికి జేక్ ఏం చేశాడు ? అనే కోణంలో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. మెయిన్ గా థ్రిల్లింగ్ అనిపించేలా ఎలిమెంట్స్, విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. పండోర గ్రహం విజువల్స్, యాక్షన్ సీన్స్ లో వచ్చే విజువల్స్ కూడా నిజంగానే వండర్ అనిపించేలా ఉన్నాయి.
మనకు పరిచయం లేని అద్భుతమైన సముద్రపు గర్భంలోకి వెళ్లి, అక్కడి అందమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గొప్ప అనుభూతి చెందుతాం, దర్శకుడు జేమ్స్ కామెరూన్ అడుగడుగునా గ్రేట్ విజువల్ ట్రీట్ ఇచ్చారు. నవతరం ప్రేక్షకులను సైతం మెప్పించేలా ఈ చిత్రాన్ని మోషన్ క్యాప్చర్ లో రూపొందించడం మరో ప్రధాన ప్లస్ పాయింట్. సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్ తమ పాత్రల్లో జీవించారు. ఇక మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులు తమ నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రానికి ప్రధాన మైనస్ రన్ టైమ్. ఏకంగా ఈ చిత్రం 3 గంటల 17 నిమిషాల రన్ టైమ్ ఉండటంతో బాగా స్లోగా సాగింది. ఎక్కువ రన్ టైమ్ ఉండటంతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం కష్టం అయింది. అలాగే, కథలో ఎమోషనల్ డెప్త్ లేదు. కథాబలం లోపించింది. ‘అవతార్-1, 2’ చిత్రాలను గుర్తుంచుకున్నవారికే ఈ సినిమా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ‘అవతార్-1, 2’చూడని వారికి అలాగే గుర్తులేని వారికి, ఈ చిత్రంలోని కొన్ని క్యారెక్టర్స్ అండ్ పాత్రల గతం తాలూకు సంఘటనలు కన్ ఫ్యూజన్ గా అనిపిస్తాయి.
అదే విధంగా క్వారిచ్, అతని కొడుకు స్పైడర్ మధ్య ట్రాక్ ఇంకా బలంగా ఉండాల్సింది. అలాగే సినిమాలో నేటివిటీ సమస్య కూడా కనిపించింది. కొన్ని డైలాగ్స్ బి.సి ప్రేక్షకులకు సరిగ్గా అర్థం కావు. సినిమాలో తెలుగు నేటివిటీ కోసం డైలాగ్స్ లో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మొత్తానికి స్లో నేరేషన్ తో స్క్రీన్ ప్లేను సాగదీశారు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమా సాంకేత చరిత్రలోనే ఈ సినిమాకు సంబంధించన ప్రతి క్రాఫ్ట్ అద్భుతంగా వుంది. సినిమాలో సాంకేతికంగా పెద్దగా ఎక్కడా ఎలాంటి లోపాలు కనిపించవు. 3డి విజువల్స్, వీ.ఎఫ్.ఎక్స్, యాక్షన్ గ్రాఫిక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు అద్భుతం.
తీర్పు :
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఆకట్టుకుంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, గ్రేట్ యాక్షన్ ఎపిసోడ్స్, గుడ్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమాలో అద్భుతంగా అనిపిస్తాయి. ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతమైన అందమైన మరో ప్రపంచంలోకి విహరింపజేసింది. అయితే, సినిమాలో వండర్ ఫుల్ విజువల్ కంటెంట్ తో పాటు సూపర్ స్పెషల్ ఎఫెక్ట్స్, ఎమోషన్స్ ఉన్నా.. కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్ అయింది. మొత్తమ్మీద అవతార్ 3 అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా గొప్ప విజువల్ ట్రీట్ ను ఇస్తోంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


