వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ని మరో ప్రపంచం లోకి తీసుకెళ్లిన సినిమాల్లో దర్శకుడు జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన అవతార్ ఫ్రాంచైజ్ కూడా ఒకటి. ఎప్పుడో 2009లో మొదలైన ఈ ఎపిక్ వండర్ సినిమాలు ఇప్పుడు మూడు వచ్చాయి. నెవర్ బిఫోర్ ట్రీట్ ని అందించిన మొదటి రెండు సినిమాలు తర్వాత ఇప్పుడు వచ్చిన పార్ట్ 3 కూడా మంచి వసూళ్లతో స్టడీగా దూసుకెళ్తుంది.
ఇక ఈ సినిమా ఫ్రాంచైజ్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఏ ఫ్రాంచైజ్ లేదా ట్రయాలజి లలో ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు సాధించిన ఫ్రాంచైజ్ గా నిలిచినట్టు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన మొత్తం మూడు సినిమాలు ఏకంగా 5.6 బిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ ని క్రాస్ చేసి ఇంకా రన్ అవుతూ వెళుతుంది. ఇక దీని తర్వాత స్టార్ వార్స్ ఇంకా జురాసిక్ వరల్డ్, స్పైడర్ మ్యాన్, హాబ్బిట్ ట్రయాలజిలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఇక్కడ కూడా అవతార్ టాప్ లోనే కొనసాగుతుంది అని చెప్పాలి.

