అవెంజర్స్ ఎండ్ గేమ్ .. సెకండ్ కు 18టికెట్లు !

Published on Apr 23, 2019 4:59 pm IST

అవెంజర్స్ సిరీస్ లో భాగంగా రానున్న నాలుగవ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్. ఈ సిరీస్ లో వస్తున్న చివరి చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తునారు. ఈ మచ్అవైటెడ్ మూవీ కి ఇండియాలో క్రేజ్ మాములుగా లేదు. ఈనెల 26న ఈచిత్రం ఇంగ్లీష్ , తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఇక ఇప్పటికే బుక్‌ మై షో యాప్‌లో పది లక్షల కు పైగా ఈ చిత్రం యొక్క టికెట్లు అమ్ముడైయ్యాయట. రికార్డు స్థాయిలో సెకండ్ కి 18 టికెట్లు అమ్మడైయ్యాయని బుక్ మై షో సంస్థ వెల్లడించింది.

ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా స్క్రీన్లలో విడుదలకానుంది. ఈ రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న తొలి హాలీవుడ్‌ చిత్రం ఇదే కావడం విశేషం. ఆంటోని రుస్సో, జో రుస్సోలు తెరకెక్కించిన ఈ చిత్రంలో రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ ఇవాన్స్‌, మార్క్‌ రుఫలో, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :