2019 గాను ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం

Avengers11

2019 ముగియడంతో అందరూ బాక్సాఫీస్ లెక్కలు మొదలుపెడుతున్నారు. ముఖ్యంగా 2019గాను అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఏదని చూడగా ఆశ్చర్య కరంగా ఒక హాలీవుడ్ మూవీ నిలిచింది. అవెంజర్స్ ది ఎండ్ గేమ్ 2019 గాను ఇండియా పరిధిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మార్వెల్స్ సూపర్ హీరోస్ తో తెరకెక్కిన ఈ చిత్రం 375కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసి దేశీయ చిత్రాలకు షాక్ ఇచ్చింది.

హిందీ, తెలుగు తమిళంతో పాటు దేశంలోని పలు ప్రధాన భాషలలో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా విశేష ఆదరణ దక్కించుకొని రికార్డ్ వసూళ్లు సాధించింది. ఇక అవెంజర్స్ మూవీ తరువాత హ్రితిక్ నటించిన వార్ మూవీ దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. హ్రితిక్ టైగర్ ష్రాఫ్ చేసిన ఈ మల్టీ స్టారర్ బిగ్గెట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Exit mobile version