మెగాస్టార్ ‘సైరా’కు మ్యూజిక్ అందిస్తున్న ‘మ్యూజిక్ జీనియస్’ !

Published on Aug 20, 2018 11:20 am IST


సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న బయోపిక్ ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి భారీ తారాగణ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర టీజర్ ను రేపు ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు.

కాగా తాజాగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ను ప్రకటించింది చిత్రబృందం. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేదీ ‘సైరా’కు సంగీతం అందిచనున్నారు. అమిత్‌ ఇప్పటివరకు మ్యూజిక్ అందించిన చిత్రాల లిస్ట్ తో కలిపి ఓ ప్రోమోను విడుదల చేస్తూ ‘సైరా’ చిత్రానికి ఈ మ్యూజిక్ జీనియసే సంగీతం అందించనున్నారని అధికారికంగా తెలిపింది చిత్రబృందం. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More