జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్బంగా అవార్డుల ప్రదానం

Published on May 21, 2019 3:55 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఫేమస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , మాస్టర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లను హైదరాబాద్ లో అందించారు . ఈ సందర్భంగా ఆర్ కె కళాసాంసృతిక ఫౌండేషన్ అధినేత డా. రంజిత్ కుమార్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న భారత కళలను పునః ప్రారంభిచేందుకు అంతర్జాతీయ స్థాయిలో సకలకళా యజ్ఞం ప్రారంబిస్తున్నాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సకలకళా యజ్ఞం పోస్టర్ ను దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే పలువురు కళాకారులకు ఫేమస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గురువులకు మాస్టర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బహుకరించాం అన్నారు.ఈ కార్యక్రమంలో 200లకు పైగా కళాకారులు , ముఖ్య అతిధులు, ఎన్టీఆర్ ఫాన్స్ పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :

More