విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న నాని చిత్రం !

నాని నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ‘అ!’. టీజర్, పోస్టర్లతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ నెలకొని ఉంది. కథే సినిమాకి హీరో అని చెప్పబడుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా చిత్రాన్ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన వాయిదావేసుకున్నారు.

చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 16న సినిమా రిలీజ్ కానుంది. అన్ని సినిమాలయందు ‘అ!’ సినిమా వేరయా అంటూ ఈ ప్రకటనను కూడా వినూత్నంగానే చేశారు చిత్ర యూనిట్. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రెజినా, ఈషా రెబ్బ, నిత్యా మీనన్, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ వంటి నటీనటులు నటిస్తుండగా నాని, రవితేజలు రెండు పాత్రలకు వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.