లెనిన్ : అయ్యగారే నెంబర్ వన్ అంటున్న జైనబ్..!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుండటంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా చిత్రబృందం అభిమానులు మరియు ప్రేక్షకుల సమక్షంలో గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో అఖిల్ భార్య జైనబ్ రావ్‌జీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహం తర్వాత అఖిల్‌తో కలిసి ఆమె ఒక సినిమా ఈవెంట్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ వేడుకలో భాగంగా ‘లెనిన్’ సినిమాలో అఖిల్ నటనపై జైనబ్ స్పందిస్తూ ‘అయ్యగారే నెం.1’ అంటూ కామెంట్ చేసింది. గతంలో ఒక అభిమాని డైలాగ్‌తో మొదలై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన ఈ మీమ్ ఫ్రేజ్, ఇప్పుడు సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్లీ వైరల్ అవుతోంది. తాజాగా జైనబ్ స్వయంగా ఈ డైలాగ్ చెప్పిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. పెళ్లి తర్వాత అఖిల్‌కు దక్కిన ఈ మొదటి విజయం అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

Exit mobile version