8 ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న ‘ బాహుబలి-2’ !
Published on Jun 17, 2018 9:14 am IST

భారతీయ సినీ చరిత్రలో ‘బాహుబలి-2’ సృష్టించిన చరిత్ర సామాన్యమైనది కాదు.ఈ చిత్రం సాధించిన విజయంతో తెలుగు సినిమా ఖ్యాతి దేశవ్యాప్తమైంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా, రన్ పరంగా ఇంకా కొన్నేళ్ల పాటు నిలిచిపోగల రికార్డుల్ని క్రియేట్ చేసిన ఈ చిత్రం నిన్న జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సైతం ఆశ్చర్యపరిచే విధంగా 8 అవార్డుల్ని కైవసం చేసుకుంది.

ముందుగా ఉత్తమ చిత్రం అవార్డ్ ఈ సినిమాకు దక్కగా ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. అలాగే బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరీలో ‘భల్లాలదేవ’ పాత్రకుగాను రానా దగ్గుబాటి, ఉత్తమ సహాయనటిగా ‘శివగామి’ పాత్రకుగాను రమ్యకృష్ణ పురస్కారాలను సొంతం చేసుకోగా సాంకేతిక విభాగంలో ఉత్తమ సంగీత దర్శకుడిగా, గేయ రచయితగా (దండాలయ్యా) కీరవాణి రెండు అవార్డులను, ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా సెంథిల్ కుమార్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ అవార్డులను దక్కించుకున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook