చైనాలో సరికొత్త రికార్డ్ నెలకొల్పిన ‘బాహుబలి-2’ !
Published on Apr 26, 2018 8:56 am IST

ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఇండియన్ సినిమా పేరిట సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి-2’ చైనాలో కూడ విడుదలకు ముందే ఒక ఘనతను తన పేరిట రాసుకుంది. ఇప్పటి వరకు చైనాలో ఏ భారతీయ చిత్రం కూడ ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలకాలేదు. అలాంటిది ‘బాహుబలి-2’ మాత్రం భారీ ఎత్తున ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానుంది.

ఈ విషయాన్నే తెలుపుతూ నిర్మాత శోభు యార్లగడ్డ చైనా మార్కెట్లో విజయం సాధించడం కష్టమైన విషయం, ‘బాహుబలి’2’ విజయాన్ని సాదిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. ఇది వరకు విడుదలైన పలు భారతీయ చిత్రాలు చైనాలో మంచి విజయాన్ని సాధించి ఉండటంతో మే 4న విడుదలకానున్న ‘బాహుబలి’పై అక్కడి ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి.

 
Like us on Facebook