ఇప్పటివరకూ ఉన్న లోకల్ మరియు ఓవర్సీస్ తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగ రాస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ట్రిపుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ తో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచే ఆల్ టైం రికార్డ్స్ సృష్టించడం మొదలు పెట్టింది. బాహుబలిలో నటించిన ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణల నటనకి మరియు విజువల్ ఎఫెక్ట్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన సెట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నాయి.
ఇక ఈ సినిమా నైజాం లో క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ విషయానికి వస్తే మొదటి రోజు 6.22 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని ఇది వరకు తెలియజేశాం. మాకు అందిన లేటెస్ట్ జెన్యూన్ రిపోర్ట్ ప్రకారం రెండవ రోజు 3.55కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ గా రెండు రోజుల్లో 9.77 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. మూడవ రోజుతో 14 కోట్ల మార్క్ ని టచ్ చేసి ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొదటి రెండు రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే ప్రధమం. ఆర్కా మీడియా వారు నిర్మించిన బాహుబలి సినిమా అన్ని భాషల్లోనూ బాక్స్ ఆఫీసును కలెక్షన్స్ తో షేక్ చేస్తోంది.


