చైనాలో దుమ్మురేపుతున్న ‘బాహుబలి-2’ !

చైనాలో దుమ్మురేపుతున్న ‘బాహుబలి-2’ !

Published on May 7, 2018 8:33 AM IST

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన ‘బాహుబలి-2’ చిత్రం ఈ నెల 4వ తేదీన చైనాల్లో భారీ ఎత్తున 7000 స్క్రీన్లలో రిలీజై మొదటిరోజే 2.85 మిలియన్ డాలర్లును రాబట్టి టాప్ ఓపెనింగ్స్ అందుకున్న ఇండియన్ సినిమాల జాబితాలోనే 3వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత 5, 6వ తేదీల్లో సైతం సినిమా మంచి రన్ ను కనబర్చి మూడు రోజులకు గాను 7.8 మిలియన్ డాలర్ల గ్రాస్ అనగా సుమారు రూ. 52 కోట్లు వసూలు చేసింది. ఈ వసూళ్లతో ఈ చిత్రం యొక్క ప్రపంచవ్యాప్త వసూళ్లు మరింతగా పెరగనున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించారు.

తాజా వార్తలు