‘బాహుబలి’ పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడంటే.!

‘బాహుబలి’ పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడంటే.!

Published on Jul 6, 2015 10:24 PM IST

baahubali1
ఒకటిన్నరేళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి రెండు పార్ట్స్ గా సినిమా చేయాలని నిర్ణయించుకొని రెండేళ్ళు మొదటి పార్ట్ కోసం షూటింగ్ చేసిన మొట్ట మొదటి ఇండియన్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ చూపు ఈ వారం రిలీజ్ కానున్న బాహుబలి పైనే ఉంది. అందరూ ఈ సినిమా వారిని థ్రిల్ చెయ్యడమే కాకుండా విజువల్స్ పరంగా మరో ప్రపంచానికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా జూలై 10న అత్యధిక థియేటర్స్ లో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది.

కొంతమంది ఫస్ట్ పార్ట్ వచ్చేస్తోంది, అది ఎలాగో మెప్పిస్తుంది అది చూసిన తర్వాత సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ ని ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. వాటికి సమాధానం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పాడు. ‘బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ అయిపోయాక కొద్ది రోజులు రిలాక్స్ అవ్వనున్నాం. సెప్టెంబర్ నుంచి సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలెట్టేస్తాం. 120 రోజులపైనే షూటింగ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఇదే టైంకి రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాం’ అని తెలిపాడు.

ప్రభాస్ ని డీ కొట్టే విలన్ గా రానా దగ్గుబాటి కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు.

తాజా వార్తలు