‘బాహుబలి-2’ కి ఈరోజే అత్యంత కీలకమైన రోజు !

17th, April 2017 - 04:46:01 PM


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు తరచూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిత్రం అతి కీలకమైన సెన్సార్ ఘట్టాన్ని ఈరోజే ఎదుర్కోనుంది. సాయంత్రం సెన్సార్ బోర్డు సభ్యులకు హైదరాబాద్ లో ప్రత్యేకమైన షో వేయనున్నారు. ఆ షో ద్వారానే సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయనున్నారు.

మొదటి భాగం విడుదలైన తర్వాత రెండేళ్ల వరకు చిత్రీకరణ జరుపుకుని రిలీజవుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సినిమాను సుమారు దేశ వ్యాప్తంగా సుమారు 6,500 థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. సినిమాకునం క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని రిలీజుకు వారం నుండి రిలీజైన తర్వాత మరో వారం వరకు మరే పెద్ద హీరోల సినిమాలు రిలీజవడంలేదు.