
భారత చలన చిత్ర స్టాండర్డ్స్ ని ఇంటర్నేషనల్ మూవీస్ కి పరిచయం చేయనున్న తెలుగు సినిమా ‘బాహుబలి’. ఇప్పటివరకూ పరాజయం అంటూ లేని టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాని రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో ‘బాహుబలి – ది బిగెనింగ్’ అనే టైటిల్ తో రానున్న మొదటి పార్ట్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇంకా 10 రోజులు మాత్రమే ఉండడంతో ఈ చిత్ర టీం ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ఇదే టైం కి వస్తుందని ఇదివరకే తెలియజేశాం. కానీ ఎంత షూటింగ్ పెండింగ్ ఉందనే విషయంపై మేము క్లారిటీ ఇవ్వనున్నాం. బాహుబలి పార్ట్ 2 కోసం ఇంకా 605కి పైనే షూటింగ్ చేయాల్సింది ఉంది. మిగిలిన 60% షూట్ ని ఫినిష్ చెయ్యడం కోసం 120 రోజుల షూటింగ్ బాలన్స్ ఉంది. అలాగే సెకండ పార్ట్ కి సంబదించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టాల్సి ఉంది. అందుకే ఈ చిత్ర టీం సెకండ్ పార్ట్ కోసం ఏడాది గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ రెండు పార్ట్స్ కోసం ఆర్కా మీడియా వారు పెట్టిన బడ్జెట్ 250 కోట్లు కావడం విశేషం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, శివుడు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుంటే రానా బళ్ళాలదేవగా కనిపించనున్నాడు. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

