బాహుబలి ఓవర్సీస్ రికార్డ్ – 2 రోజుల్లో 3 మిలియన్ డాలర్స్

బాహుబలి ఓవర్సీస్ రికార్డ్ – 2 రోజుల్లో 3 మిలియన్ డాలర్స్

Published on Jul 12, 2015 11:02 AM IST

baahubali-b

తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతిని ఒక్కసారి ఇండియన్ సినిమాకి పరిచయం చయడమే కాకుండా ఇంటర్నేషనల్ సినిమాని కూడా ఒక్కసారి మనవైపు తిప్పుకునేలా చేసిన గ్రాఫికల్ విజువల్ వండర్ ‘బాహుబలి’. గత వారం రోజుల నుంచి వారాల్లో నిలిచిన ఈ పేరు రెండు రోజుల నుంచి సెన్సేషనల్ రికార్డ్స్ ని సృష్టిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఓవర్సీస్ అని తేడా లేకుండా ప్రతో చోటా సూపర్ హిట్ టాక్ తో అన్ని ఓల్డ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతోంది.

మునుపెన్నడూ లేని రీతిలో ఓ తెలుగు సినిమా ఓవర్సీస్ లో రోజుకో మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. కేవలం ప్రీమియర్ షోస్ తోనే 1.3 మిలియన్ డాలర్స్ క్రియేట్ చేసిన బాహుబలి శుక్ర, శనివారాల్లో కూడా అదే రీతిలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఆ వివరాలు మీకోసం.. గురువారం ప్రీమియర్స్ కి $1369 షేర్ వస్తే శుక్రవారం $1070షేర్ సాధించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం శనివారం కూడా 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది, కానీ కచ్చితమైన నెంబర్స్ రిలీజ్ కావాల్సి ఉంది. దీని ప్రకారం మొదటి రెండు రోజుల్లో 3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది.

కేవలం రెండు రోజుల్లో 3 మిలియన్స్ క్రాస్ చెయ్యడమే కాకుండా ఇప్పటి వరకూ యుఎస్ లో రికార్డ్ అయిన ఫస్ట్ వీకెండ్ టాప్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయనుంది. ఇప్పటి వరకూ మొదటి వీకెండ్ లో అమీర్ ఖాన్ పికె సినిమా 3.1మిలియన్ కలక్ట్ చేస్తే, ధూమ్ 3 సినిమా3.05మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల రికార్డ్ ని బాహుబలి బ్రేక్ చేస్తుందని యుఎస్ ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు