ఆంధ్రలో 45 కోట్ల మార్క్ దిశగా ‘బాహుబలి’

baahubali11
‘బాహుబలి’ – జూలై 10న రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ కి అడ్డాగా మారింది. టాలీవుడ్ సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ప్రభాస్ హీరోగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తే, రానా విలన్ గా కనిపించాడు. ప్రసతుతం తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మరధం పడుతున్న ఈ సినిమా ఇరు రాష్ట్రాల్లో కేవలం 10 రోజుల్లో 75 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏరియా వైజ్ కూడా ఆల్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్న బాహుబలి సినిమా కేవలం ఆంద్ర ప్రాంతంలో సరికొత్త రికార్డ్ దిశగా దూసుకుపోతోంది. మాకున్న ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఒక్క ఆంధ్ర(నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైజాగ్)లో మాత్రమే లాంగ్ రన్ లో బాహుబలి 45 కోట్ల షేర్ మార్క్ ని కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. ఆంధ్ర ప్రాంతలో ఇంత కలెక్షన్స్ రానుండడం ఇదే మొదటి సారి. ఆంధ్ర ప్రాంతంలో మొదటి 11 రోజుల్లో సుమారు 34 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇప్పటికే పలు ఏరియాల ఆల్ టైం రికార్డ్ ని బ్రేక్ చేసిన బాహుబలి లాంగ్ రన్ లో మిగిలిన ఏరియాల రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుందని అంటున్నారు.

Exit mobile version