కేరళ వర్గాలను షాక్ చేస్తున్న ‘బాహుబలి’ షేర్.!

కేరళ వర్గాలను షాక్ చేస్తున్న ‘బాహుబలి’ షేర్.!

Published on Jul 19, 2015 11:26 PM IST

baahubali-b

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయంలో, రానా దగ్గుబాటి విలన్ గా సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా గత 10 రోజులుగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల బాక్స్ ఆఫీసులని షేక్ చేస్తోంది. విడుదలైన ప్రతి భాషలోనూ రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. తాజాగా కేరళలో కూడా పాత రికార్డ్ లని బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. మొదటి నాలుగు రోజుల్లో కలుపుకొని బాహుబలి సినిమా కేరళలో 2.65కోట్ల షేర్ ని సాధించి ఇప్పటి వరకూ మలయాళంలో టోటల్ లాంగ్ రన్ లో 2.5కోట్ల షేర్ సాధించిన డబ్ సినిమా ‘లక్కీ – ది రేసర్’ రికార్డ్ ని బ్రేక్ చేసిందని ఇది వరకే తెలియజేశాం.

తాజాగా కేరళ ట్రేడ్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, మొదటి వారమే కాకుండా, సెకండ్ వీకెండ్ లో కూడా ఈ సినిమా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. మొదటి 9 రోజుల్లోనే 4 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిన బాహుబలి లాంగ్ రన్ లో మొత్తంగా 6.5 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. డబ్బింగ్ తెలుగు సినిమాకి ఈ రేంజ్ లో వస్తున్న కలెక్షన్స్ చూసి అక్కడి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఒక్క మలయాళంలోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఇదే రేంజ్ కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా అన్ని భాషల్లోనూ అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలుస్తుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు