
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ మరో బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శివుడుగా, బాహుబలిగా ప్రేక్షకులను అమితంగా మెప్పించాడు. విడుదలకు ముందు అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీసు వద్ద రికార్డుల మోత మోగించిన బాహుబలి 3వ వారంలో కూడా తన సక్సెస్ఫుల్ జర్నీని కొనసాగిస్తోంది. మొదటి రెండు వారాల్లో కేవలం ఇరు రాష్ట్రాల్లోనే 85 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. బాహుబలి తాజాగా మరో సెన్సేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేసింది.
బాహుబలి మొదటి 16 రోజుల్లో ఒక్క తెలుగులోనే 150 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి ని ఆల్ టైం ఎవర్గ్రీన్ రికార్డ్ ని సృష్టించింది. ఇరు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఓవర్సీస్ లలో ఒక్క తెలుగులోనే మొదటి 16 రోజుల్లో సుమారు 152 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. ఇది ఆల్ టైం తెలుగు రికార్డ్ కి డబుల్ అని చెప్పాలి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ హిందీ భాషల్లో కలుపుకొని 200 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఒక తెలుగు సినిమా అన్ని భాషల్లో కలుపుకొని 200 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేయడం అందరినీ షాక్ కి గురిచేయడమే కాకుండా తెలుగువారిని గర్వంగా ఫీలయ్యేలా చేసింది.
రానా దగ్గుబాటి విలన్ గా కనిపించిన ఈ మూవీలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.

