
తెలుగు చలన చిత్ర అన్ని రికార్డులను బద్దలు కొడుతూ డైరెక్ట్ తెలుగులోనే 100 కోట్ల షేర్ సాధించే దిశగా బాక్స్ ఆఫీసు వద్ద దూసుకుపోతున్న సినిమా ‘బాహుబలి’. ఒక్క తెలుగులోనే కాకుండా విడుదలైన తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం ప్రతి ఒక్క ఏరియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా బాహుబలి నిలిచి పోతుందని చెబుతున్నారు. నైజాంలో కనీ వినీ ఎరుగని అమౌంట్ తో సినిమా ఫైనల్ షేర్ క్లోజ్ అవుతుందని తెర్డ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది వరకే మొదటి నాలుగు రోజుల్లో నైజాంలో బాహుబలి సినిమా 16.2కోట్ల షేర్ సాధించింది, అలాగే మొదటి వారం పూర్తయ్యే టైంకి 21 – 22 కోట్ల షేర్ సాధిస్తుందని అంటున్నారు. అలాగే లాంగ్ రన్ లో మొత్తంగా 33- 35 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ కచ్చితంగా చెబుతున్నారు. వీక్ డేస్ లో కూడా సినిమాకి స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఈ కలెక్షన్స్ వస్తాయని ధీమాగా ఉన్నారు. నైజాంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు 20 కోట్ల మార్క్ వరకూ వస్తుంటే బాహుబలి మాత్రం 30 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే దిశగా దూసుకుపోతుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.
ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ మార్క్ కి ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాల స్టార్ ఇమేజ్ కూడా తోడవడంతో ఈ సినిమాకి కలెక్షన్స్ వరదలా వస్తున్నాయి.

