
ఇండియన్ మరియు తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సెట్టింగ్స్ మరియు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. విడుదలైన మొదటి రోజు నుంచే అటు విమర్శకుల చేత, ఇటు ప్రేక్షకుల చేత సూపర్ హిట్ అనిపించుకుంటున్న ఈ సినిమా విడుదలైన నాలుగు భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. ఈ సినిమాని అన్ని ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీస్ అంతా కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుండడంతో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మరే సినిమాని దరి చేరకుండా రికార్డ్స్ నెలకొల్పుతోంది.
ఎవ్వరూ ఊహించని విధంగా మొదటి రెండు రోజుల్లోనే ఓవర్సీస్ లో 3.4మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. మేము ఇది వరకే మొదటి రెండు రోజుల్లో 3 మిలియన్స్ క్రాస్ చేస్తుందని తెలియజేశాం. చెప్పినట్లుగానే 3 మిలియన్స్ డాలర్స్ ని క్రాస్ చేసింది. రోజు వారిగా కలెక్షన్స్ వివరాలు..
| వారం | కలెక్షన్స్(డాలర్స్ లో) |
| గురువారం ప్రీమియర్స్ | $ 1,360,200 |
| శుక్రవారం | $ 1,061,359 |
| శనివారం | $ 1,035,046 |
| మొత్తం | $ 3,456,605 [ఇండియన్ కరెన్సీ ప్రకారం 21.91కోట్ల రూపాయలు] |

