ఓవర్సీస్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసిన ‘బాహుబలి’

ఓవర్సీస్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసిన ‘బాహుబలి’

Published on Jul 26, 2015 9:14 PM IST

baahu-bali

హాలీవుడ్ స్థాయిలో మేము సినిమాలు చేయగలం అని తెలుగు ప్రజలు కాలర్ ఎగరేసి చెప్పుకునేలా చేసిన సినిమా ‘బాహుబలి’. ఇండియన్ మరియు తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సెట్టింగ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన ఈ భారీ పీరియాడికల్ ఫిల్మ్ కలెక్షన్స్ పరంగా కూడా అంతే సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పటి వరకూ గడిచిన 17 రోజుల్లో ఈ సినిమా గ్రాస్ పరంగా 450 కోట్ల మార్క్ కి దగ్గరవుతోంది. ఒక్క ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా రికార్డ్స్ కలెక్షన్స్ సాధిస్తోందని తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో బాహుబలి సినిమాని అన్ని భాషల్లో కలుపుకొని $ 9.5 మిలియన్స్ సాధించింది. అంతే కాకుండా ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సౌత్ ఇండియన్ మూవీస్ లిస్టులో సెకండ్ ప్లేస్ కొట్టేసింది. ఓవర్సీ రోబో సినిమా $14.8 మిలియన్స్ కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ లో ఉంటే బాహుబలి 16 రోజుల్లోనే $9.5 మిలియన్స్ సాధించి సెకండ్ ప్లేస్ కొట్టేసింది. మూడప ప్లేస్ లో $9.1 మిలియన్స్ తో ఐ సినిమా ఉంది. త్వరలోనే బాహుబలి $10మిలియన్ మార్క్ ని టచ్ చేస్తుందని సమాచారం. ఎస్ఎస్ రాజమౌలు సృష్టికి ప్రతి రూపమైన ఈ బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు