
రోజురోజుకూ ఇంతింతై వటుదింతై అంటూ ఆకాశానికి చేరిన బాహుబలి ప్రస్తుతం ఏమి చేసినా సంచలనమే. జులై 10న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చిత్రబృందం నిమఘ్నమై వున్నారు. ఈ సినిమాను నార్త్ లో ప్రదర్శించేటప్పుడు సబ్ టైటిల్స్ అందజేస్తామని ఇటీవలే తెలిపారు. ఇక ఈరోజు మొట్టమొదటిసారిగా బాహుబలికి సంభందించిన వీడియో సాంగ్ ని వదిలారు.
అదికూడా ఆల్బమ్ లో సూపర్ హిట్ సాంగ్ అయిన ‘మమతల తల్లి’ పాటను విడుదల చెయ్యడం విశేషం. ఈ పాట రమ్యకృష్ణని ఉద్దేశిస్తూ రచించినట్టు తెలుస్తుంది. రమ్యకృష్ణ రాజాసం, పౌరుషం, ప్రభాస్ భిన్న పార్శ్వల నటన ఆకట్టుకున్నాయి. ఎప్పటిలాగే రానా మెప్పించాడు. కీరవాణి అందించిన సంగీతం ప్రధానఆకర్షణగా నిలవనుంది.

