ఫస్ట్ వీక్ రిపోర్ట్ : బాహుబలి @ 60 కోట్లు

baahubali1
ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఏ రేంజ్ వార్తల్లో నిలిచిందో రిలీజ్ తర్వాత అంతకు మించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కలెక్షన్స్ పరంగా ట్రేడ్ వర్గాలే షాక్ అయ్యేలా సునామీని సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే తెలుగు చలన చిత్ర సీమ ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానంలో నిలబడిన సినిమా ‘బాహుబలి’. తెలుగు చలన చిత్ర దశ, దిశని మార్చి తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్ళి ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్.

మునుపెన్నడూ చూడని భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్.. ఇలాంటివన్నీ ఆడియన్స్ ని రంజింపజేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోన్న బాహుబలి కేవలం ఆంధ్ర – తెలంగాణలతో కలుపుకొని మొదటి వారం 60 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఈ మార్క్ టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం రికార్డ్ గా చెప్పుకోవచ్చు.. మొదటి వారం ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు..

ఏరియా
కలెక్షన్స్(షేర్)
నైజాం 22.54 కోట్లు
సీడెడ్  12.00 కోట్లు
నెల్లూరు 2.25 కోట్లు
గుంటూరు 5.48 కోట్లు
కృష్ణా 3.65 కోట్లు
పశ్చిమ గోదావరి 4.54 కోట్లు
తూర్పు గోదావరి 5.28 కోట్లు
వైజాగ్  5.53 కోట్లు
మొత్తం 61.27 కోట్లు
Exit mobile version