ఆల్ టైం రికార్డ్ : ‘బాహుబలి’ హిందీ శాటిలైట్ రైట్స్

ఆల్ టైం రికార్డ్ : ‘బాహుబలి’ హిందీ శాటిలైట్ రైట్స్

Published on Jul 10, 2015 4:20 PM IST

Baahubali-still
గత మూడేళ్ళ నుంచి తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు ‘బాహుబలి’ చూస్తామా,, ఇది మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకుందామా అని ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది. ఈ రోజు రిలీజ్ అయిన బాహుబలి సినిమాకి బెనిఫిట్ షోస్ నుంచే టాలీవుడ్ గర్వంగా చెప్పుకునే మూవీ అని అంటున్నారు. నటీనటులను మునుపెన్నడూ చూడని స్ట్రాంగ్ క్యారెక్టర్స్ లోనే కాకుండా అద్భుతమైన గ్రాఫికల్ విజువల్స్ తో థ్రిల్ చేస్తోంది ‘బాహుబలి’. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే రైట్స్ విషయంలో ప్రతి భాషలోనూ రికార్డ్స్ సృష్టిస్తోంది.

రిలీజ్ అయిన కొద్ది సేపట్లో బాహుబలి సినిమా హిందీలో ఓ సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. బాహుబలి సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ని సోనీ పిక్స్ వారు సొంతం చేసుకున్నారు. అది కూడా రికార్డ్ స్థాయిలో అక్షరాల 17 కోట్లకి శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారు. భారీగా రిలీజ్ అయినా, ఒక తెలుగు డబ్బింగ్ సినిమాకి శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ కి అమ్ముడు పోవడం ఆల్ టైం రికార్డ్ అని అంటున్నారు. సక్సెస్ కి మారుపేరు అయిన దర్శకధీర ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తే రానా విలన్ గా కనిపించాడు. తమన్నా తు వారియర్ గా, ఇటు గ్లామర్ డాల్ గా ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే శివుడు యాక్షన్ ఎపిసోడ్ మరియు వార్ ఎపిసోడ్ సినిమాకి అల్టిమేట్ హైలైట్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు