70 కోట్లు క్రాస్ చేసిన హిందీ ‘బాహుబలి’

70 కోట్లు క్రాస్ చేసిన హిందీ ‘బాహుబలి’

Published on Jul 24, 2015 12:34 AM IST

baahu-bali
నేటితో టాలీవుడ్ గర్వించదగిన ‘బాహుబలి’ మూవీ రిలీజ్ అయ్యి రెండు వారాలు పూర్తవుతుంది. కానీ ఇప్పటికీ ఈ సినిమాకి క్రేజ్ తగ్గలేదు, టికెట్ల కోసం థియేటర్స్ దగ్గర బారులు తీరిన వారి సంఖ్య తగ్గడం లేదు. సౌత్ ఇండియాలోని నాలుగు భాషలు మరియు హిందీలో కలిపి రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. కేవలం తెలుగు ఇరు రాష్ట్రాల్లోనే బాహుబలి 12 రోజుల్లో 80 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. తాజాగా హిందీలోనూ రికార్డ్ సృష్టించింది. మొదటి 13 రోజుల్లో 70 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. రోజువారీగా ఈ 13 రోజుల కలెక్షన్స్ వివరాలు..

వారం  కలెక్షన్స్ (షేర్)
ఫస్ట్ వీక్ 46.77 కోట్లు
శుక్రవారం 3.25 కోట్లు
శనివారం 4.70 కోట్లు
ఆదివారం 5.40 కోట్లు
సోమవారం 3.82 కోట్లు
మంగళవారం 3.20 కోట్లు
బుధవారం 3.05 కోట్లు
మొత్తం
70.19 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు