
సౌత్ ఇండియన్ ఆల్ టైం రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన గ్రాఫికల్ విజువల్ వండర్ ‘బాహుబలి’. అభిమానుల్లో ఉండే భారీ అంచనాలను అందుకోవడం చాలా కష్టం. కానీ బాహుబలి సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు నుంచే ప్రతి ఏరియాలోనూ రికార్డ్ నెంబర్స్ కలెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో డైరెక్టర్ రాజమౌళి – ప్రభాస్ – రానా – అనుష్క – తమన్నాల క్రేజీ కాంబినేషన్ ప్రతి ఒక్కరినీ థియేటర్స్ కి ఆకర్షిస్తోంది. ప్రతి ఏరియాలోనూ న్యూ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ఈ సినిమా సీడెడ్ లో కూడా ఓ ల్యాండ్ మార్క్ ఫిగర్ కి దగ్గరవుతోంది.
మొదటి 10 రోజుల్లో సీడెడ్ లో 15 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిందని ఇది వరకే తెలియజేశాం. ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న తాజా సమాచారం ప్రకారం మొదటి 16 రోజుల్లో బాహుబలి 18.3 కోట్ల షేర్ సాధించింది. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ సినిమా 20 కోట్ల షేర్ ల్యాండ్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. ఓవరాల్ రన్ టైంలో 23-25 మధ్య ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరోవైపు కేర్వళం ఇరు రాష్ట్రాల్లో కలుపుకొని 3వ వీకెండ్ లోపు ఈ సినిమా 90 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి 100 కోట్ల మార్క్ కి దగ్గరవుతుందని అంటున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ తోనే 100 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేయనున్న తొలి తెలుగు సినిమా ఇదే..
.

