
ఇండియన్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఈ సినిమా మలయాళం ఆడియో రిలీజ్ కార్యక్రమం నిన్న సాయంతం కొచ్చిలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా మలయాళంలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన గ్లోబల్ యునైటెడ్ మీడియా వారు ఓ అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ పోస్టర్ ని లాంచ్ చేసారు. రిపోర్ట్స్ చెబుతున్న సమాచారం ప్రకారం ఈ పోస్టర్ ఆర్గనైజర్స్ ఈ పోస్టర్ ని గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం పంపనున్నారు.
ఈ ఆడియో లాంచ్ కి హాజరైన ఈ చిత్ర టీం మొత్తం మీడియాతో మాట్లాడి, ఈ సినిమా గురించిన గురించిన ఎన్నో విశేషాలను తెలియజేశారు. ఇప్పటి వరకూ నార్త్ లో జోరుగా ప్రచారం చేసిన బాహుబలి టీం ఇప్పుడు సౌత్ లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

