స్టైల్ మార్చిన ‘బాహుబలి’

స్టైల్ మార్చిన ‘బాహుబలి’

Published on Aug 8, 2014 3:51 AM IST

baahubali
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇటివలే ప్రభాస్, తమన్నాలపై ఒక పాటను చిత్రీకరించిన రాజమౌళి, తాజాగా ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘బాహుబలి’ టీజర్ లో ఒక లుక్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ కొంచం గడ్డం పెంచుకుని కనిపించారు. అది తండ్రి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ లుక్. తాజాగా తమన్నాతో తెరకెక్కిస్తున్న సన్నివేశాల కోసం గడ్డం తెసేశారు ప్రభాస్. రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించిన అభిమానులతో ప్రభాస్ ఫోటోలు దిగారు. వాటిలో కొత్త లుక్ బయటపడింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రానా, రమ్యకృష్ణ, నాజర్ అడవి శేష్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్ 2015 ఏప్రిల్ లో విడుదల కానుంది.

తాజా వార్తలు