
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బాహుబలి సినిమా సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి థ్రిల్ చేస్తుంటే, మరోవైపు బాక్స్ ఆఫీసు వద్ద ఆ సినిమా కురిపిస్తున్న కాసుల వర్షం ట్రేడ్ వర్గాలను షాక్ కి గురిచేస్తోంది. మునుపెన్నడూ చూడని భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్.. ఇలాంటివన్నీ ఆడియన్స్ ని రంజింపజేస్తున్నాయి. మాస్టర్ మైండ్ అనిపించుకున్న జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. తాజాగా అందిన ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఆంధ్ర – తెలంగాణలతో కలుపుకొని కేవలం 5 రోజుల్లో బాహుబలి సినిమా 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. మూదటి వారం పూర్తయ్యే టైంకి ఇరు రాష్ట్రాల్లో 60 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని తెర్డ్ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి మొదటి 5 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో ఏరియా వైజ్ కలెక్ట్ చేసిన షేర్ వివరాలు మీకోసం..
| ఏరియా | కలెక్షన్స్(షేర్) |
| నైజాం | 18.44 కోట్లు |
| సీడెడ్ | 10.81 కోట్లు |
| నెల్లూరు | 1.93 కోట్లు |
| గుంటూరు | 4.79 కోట్లు |
| కృష్ణా | 3.16 కోట్లు |
| పశ్చిమ గోదావరి | 4.10 కోట్లు |
| తూర్పు గోదావరి | 4.49 కోట్లు |
| వైజాగ్ | 4.62 కోట్ |
| మొత్తం | 52.35 కోట్లు |