టాలీవుడ్ ఎవర్గ్రీన్ రికార్డ్ కి చేరువైన ‘బాహుబలి’

baahubali
తెలుగు మరియు ఇండియన్ సినీ అభిమానులను కనీ వినీ ఎరుగని సెట్టింగులతో, హాలీవుడ్ సినిమాని తలపించే విజువల్స్ తో థ్రిల్ చేసిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా ఆడియన్స్ ని థ్రిల్ చేయడంలోనే కాదు, కలెక్షన్స్ విషయంలో కూడా అతెలుగు చలన చిత్ర సీమ కనీ వినీ ఎరుగని రికార్డ్స్ ని కూడా సృష్టిస్తోంది. అన్ని చోట్లా క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ని కాసేపు పక్కన పెడితే తెలుగు సినిమా మొట్ట మొదటి సారిగా ఓ తెలుగు సినిమా డైరెక్ట్ గా 100 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేయనుంది. ఆ అరుదైన ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేయనున్న సినిమా ‘బాహుబలి’.

ఇక విషయంలోకి వెళితే బాహుబలి సినిమా మొదటి నాలుగు తోజుల్లోనే తెలుగు సినిమా టాప్ గ్రాసర్ అయిన అత్తారింటికి దారేది 75 కోట్ల అమార్క్ ని క్రాస్ చేసిందని ఇది వరకే తెలియజేశాం. ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న తాజా సమాచారం ప్రకారం మొదటి వారం పూర్తయ్యే సమయానికి ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ లతో కలుపుకొని ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే 100కోట్ల మార్క్ ని క్రాస్ చేసేస్తుందని అంటున్నారు. కొంతమంది అయితే 6వ రోజుతోనే 100కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. వేరే భాష కలెక్షన్స్ లేకుండా 100కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేయనున్న డైరెక్ట్ తెలుగు సినిమా బాహుబలి కానుండడం విశేషం, లాగే ఈ విషయంలో తెలుగు సినిమా అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు.

అలాగే తమిళ, మలయాళ, హిందీ భాషలతో కలుపుకొని 150కోట్ల మార్క్ టచ్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.

Exit mobile version