బాహుబలి – పశ్చిమ గోదావరి ఏరియా వైజ్ రేట్స్

బాహుబలి – పశ్చిమ గోదావరి ఏరియా వైజ్ రేట్స్

Published on Jul 9, 2015 7:41 PM IST

baahubali
యావత్ భారతదేశం ఏటగానో ఎదురు చూస్తున్న ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’ రిలీజ్ కావడానికి మరికొద్ది గంటలు మాత్రమే ఉంది. సమయం తగ్గుతున్న కొద్దీ ఈ సినిమాపై మరింత క్రేజ్ జెనరేట్ అవుతోంది. రాజమౌళి బ్రాండ్ ఈ సినిమాకి ఉండడమే ఎక్కువ క్రేజ్ ని క్రియేట్ చేస్తోంది. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని అన్ని ఏరియల్లోనూ రికార్డ్ ప్రైజ్ కి కొనుక్కున్నారు. ప్రభాస్ కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న పశ్చిమ గోదావరి రైట్స్ ని సుమారు 4.5 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే డిస్ట్రిబ్యూటర్స్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకి సినిమాని మంచి మొత్తానికే ఇచ్చారు. వీటితోనే వారు చాలా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. ప్రాంతం వారిగా థియేటర్స్ వారికి ఇచ్చిన అమౌంట్ వివరాలు..

ఏరియా ధర
భీమవరం 90 లక్షలు
పాలకొల్లు 46 లక్షలు
చింతలపూడి 12 లక్షలు
కొవ్వూరు 25 లక్షలు
నరసాపురం 23 లక్షలు
ఆకివీడు 16 లక్షలు
చాగళ్లు 5.5 లక్షలు
అత్తిలి 11.5 లక్షలు
కె కోట 2 లక్షలు
మొగల్తూరు 2.6 లక్షలు
కొనితవాడ 6.2 లక్షలు
ఉండి 3.4 లక్షలు
యర్నగూడెం 2.3 లక్షలు
గణపవరం 20 లక్షలు
నల్లజెర్ల 6.2 లక్షలు
అనంతపల్లి 3.2 లక్షలు
పెదపాడు 2.1 లక్షలు
కొయ్యలగూడెం 8.5 లక్షలు
వీరవసరం 1.7 లక్షలు
విజయరై 2.2 లక్షలు
ధర్మాజిగూడెం 1.1 లక్షలు
పెనుగొండ 6.2 లక్షలు
ఆచంట 3.7 లక్షలు
మొత్తం 3.04 కోట్లు

ఇవికాకుండా యింకా మరో 8 ఏరియాల అమౌంట్ డీటైల్స్ తెలియాల్సి ఉంది. వాటితో కలుపు కుంటే సుమారు 4కోట్ల మార్క్ దగ్గర వరకూ రీచ్ అవుతుంది. దీని ప్రకారం మొదటి వారంలోనే పశ్చిమ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ లాభాలను సొంతం చేసుకుంటారని సమాచారం. ఒక్క పశ్చిమ గోదావరిలోనే కాకుండా మిగతా అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ చాలా బాగా జరిగింది.

తాజా వార్తలు