ఈ వారాంతం కల్లా ‘బాహుబలి’ ఫస్ట్ కాపీ.!

ఈ వారాంతం కల్లా ‘బాహుబలి’ ఫస్ట్ కాపీ.!

Published on Jun 30, 2015 7:46 PM IST

Baahubali-pposter
టాలీవుడ్ భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘బాహుబలి’, ఈ చిత్ర టీం పైకి నవ్వుతూ జోరుగా ప్రచారం చేస్తున్నా రిలీజ్ టైం దగ్గర పడుతుండే కొద్దీ వారిలో ఇన్నర్ గా మాత్రం టెన్షన్ పెరుగుతోంది. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ తీసుకున్న ఈ సినిమా ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. రిలీజ్ కి ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉండడం వలన ఈ చిత్ర టెక్నికల్ టీం ఇంకాస్త స్పీడ్ గా వర్క్ ని ఫినిష్ చేస్తోంది. మరోవైపు ఎంఎం కీరవాణి కూడా రీ రికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ వర్క్ ని చివరి దశకు తీసుకు వచ్చేసాడు.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ వారాంతం కల్లా ఈ సినిమా ఫైనల్ వెర్షన్ ఫస్ట్ కాపీ సిద్దం అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది. రాజమౌళి ఒకవైపు ప్రమోషన్స్ లో పాల్గొంటూ, మిగిలిన టైం అంతా ఫైనల్ అవుట్ పుట్ ని ఫైనలైజ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. బాహుబలి మొదటి పార్ట్ జూలై 10న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రభాస్, రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రానా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్యరాజ్, సుధీప్, నాజర్, అడవి శేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు