
సగటు సినీ అభిమాని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’.. నిన్న ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమాను మొదటి రోజే చూసేయాలన్న ఆతృతలో ప్రతీ సినీ అభిమానీ ఎదురుచూశారు. ఈ క్రమంలోనే మొదటిరోజు తెలుగులో ఈ సినిమాకు కనీవినీ ఎరుగని రీతిలో ఓపెనింగ్స్ వచ్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లో కలుపుకొని ఈ సినిమా 24కోట్ల రూపాయాల షేర్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినీ పరిశ్రమలో వేరే ఏ ఇతర సినిమా ఫస్ట్‌డే కలెక్షన్లు బాహుబలి దరిదాపుల్లో కూడా లేవు. విడుదలైన దగ్గర్నుంచే ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సినిమాలోని గ్రాఫిక్స్, సెట్టింగ్‌లు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, రాజమౌళి విజన్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడనటువంటి గ్రాఫిక్స్‌తో ఈ సినిమా థ్రిల్ చేయడంతో బాహుబలిని దేశవ్యాప్తంగా విజువల్ వండర్‌గా ప్రశంసిస్తున్నారు. శని, ఆదివారాల్లో కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లు ఉండనున్నాయని ట్రేడ్ టాక్!

